యూనియన్ బ్యాంక్ మేనేజర్లు కృష్ణ, సచిన్..
నవతెలంగాణ – జన్నారం
పొదుపును అలవాటుగా మార్చుకోవాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ కృష్ణ, జన్నారం బ్రాంచ్ మేనేజర్ సచిన్ సూచించారు. జన్నారంలోని మురిమడుగులో జన సురక్ష, ఆర్థిక అక్షరాస్యతపై జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. బ్యాంకులు ప్రజల మేలు కోసం పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. మహిళా సంఘాల గ్రూపు సభ్యులు ప్రతినెల వారు కట్టవలసిన డబ్బులు జమ చేయాలన్నారు.
ప్రతి ఒక్కరు ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలన్నారు. బ్యాంకు ద్వారా వచ్చే ఓటీపీలు ఇతర ఏటీఎం పిన్ నెంబర్లు ఎవరికి చూపించకూడదన్నారు చెప్పకూడదన్నారు. సైబర్ క్రైమ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి అనుమానాలు ఉన్న నేరుగా బ్యాంకుకు వచ్చి సంప్రదించాలని సూచించారు. ప్రజలు బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.
పొదుపును అలవాటు చేసుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES