Saturday, July 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీఎంపీఎస్ జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయండి

జీఎంపీఎస్ జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయండి

- Advertisement -

 జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెపురం రాజు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
: భువనగిరి శివారులోని రాయగిరి గ్రామంలో గల లింగ బసవ గార్డెన్ జూలై 22,23 తేదీలలో జరిగే గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం జిఎంపిఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయాలని సంఘం జిల్లా కార్యదర్శి మద్దెపురం రాజు పిలుపునిచ్చారు. శనివారం భువనగిరిలో జిఎంపిఎస్   జిల్లా కమిటీ సమావేశం దయ్యాల నర్సింహ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మహాసభలకు గొల్ల, కురుమలు గొంగళ్ళు, డోలు, తాళం, గజ్జలు ధరించి, అధిక సంఖ్యలో హాజరై  జయప్రదం చేయాలని కోరారు. గొల్ల, కురుమలు, గొర్రెల మేకల పెంపకందారులు తమ సమస్యల పరిష్కారానికై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

గొర్లు మేకలకు మేత, నీరు ,వైద్యం, గొర్రెలకు భీమా, గొర్ల కాపరులకు 50సం. లకు పింఛన్లు, సబ్సిడీ రుణాలు, ఎక్స్గ్రేషియో, చదువుకున్న యువతీ, యువకులు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గొల్ల కుర్మల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తున్న ఏకైక సంఘం గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం అని కొనియాడారు. రెండో విడత గొర్ల పంపిణీ నగదు బదిలీ ద్వారా అమలు చేస్తామని కామారెడ్డి బిసి డిక్లరేషన్ కాంగ్రెస్ మేనిఫెస్టో   15,16 పేజిలలో రెండు లక్షల నగదు బదిలీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలలో చేస్తామని హామీ ఇచ్చిన హామీని, అధికారం చేపట్టి 18 నెలలు అయినా అమలు చేయలేదని విమర్శించారు.

రోగాలతో గొర్లు, మేకలు చనిపోతున్నాయని, ప్రభుత్వం నుండి ఎలాంటి మందులు అందడం లేదని అన్నారు. సంవత్సరానికి మూడుసార్లు నట్టల మందు వేస్తామని చెప్పి, రెండు సంవత్సరాలు అవుతున్నా.. ఇప్పటివరకు నట్టల మందులు వేయలేదని అన్నారు. వెంటనే ప్రభుత్వం మందులు ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూలై 22,23 తేదీలలో రాయగిరిలో జరుగు జిల్లా మహాసభలకు, సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు, గొల్ల కురుమలు భారీ సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డైరెక్టర్, జిఎంపిఎస్  జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు నర్సింహ్మ,జిల్లా అధ్యక్షులు దయ్యాలనర్సింహ్మ, ఉపాధ్యక్షులు బుడుమ శ్రీశైలం,సహాయ కార్యదర్శులు కొండె శ్రీశైలం, బుగ్గ చంద్రమౌళి, చేగూరి నర్సింహ్మ, గంగదేవి జంగయ్య, కసరబోయిన చంద్రయ్య, దేవునూరి బాలయ్య, పాక జహాంగీర్, నారి మల్లేశం, కడెం బీరప్ప, క్యాసాని నవీన్, బీమగోని బాలరాజు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -