మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మే 28, 29, 30 తేదీల్లో రాష్ట్ర మహాసభ : ఆహ్వాన సంఘం చైర్మెన్ డాక్టర్ ఎ.మధుసూదన్‌రెడ్డి
కరపత్రం విడుదల
నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభను జయప్రదం చేయాలని ఆహ్వాన సంఘం చైర్మెన్ డాక్టర్ ఎ.మధుసూదన్‌రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో శనివారం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభ కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆకలి, దారిద్య్రం నిరుద్యోగం పెరిగి యువతలో ఆందోళన పెరిగిపోతోందన్నారు. మే 28, 29, 30 తేదీల్లో జిల్లా కేంద్రంలో జరగనున్న రాష్ట్ర మహాసభకు కేరళం సీఎం పినరయి విజయన్ రానున్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బహిరంగ సభకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. సభ విజయవంతం చేయడానికి సానుభూతిపరులు, మేధావులు, ఉద్యోగులు, మహిళలు, వివిధ రంగాల కార్మికులు చేయూత అందించాలని కోరారు. ప్రజలు, వ్యవసాయ కార్మికులు, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ఎజెండాగా జరిగే ఈ మహాసభలో ఉద్యమ కార్యాచరణ రూపొందించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శ ఆర్.వెంకట్‌రాములు, కోశాధికారి ఏ.రాములు, కార్యదర్శి కిల్లెగోపాల్, కురుమూర్తి, ప్రశాంత్, భరత్ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ తధితరులు పాల్గొన్నారు.
వ్యకాస రాష్ట్ర 4వ మహాసభను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



