ప్రజానాట్యమండలి మునుగోడు డివిజన్ కార్యదర్శి చికూరి బిక్షం ..
నవతెలంగాణ – మునుగోడు
ప్రజానాట్యమండలి నల్లగొండ జిల్లా ఎనిమిదవ మహాసభలు జయప్రదం చేయాలని మహాసభల కరపత్రాన్ని మండల కేంద్రంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మునుగోడు డివిజన్ ప్రధాన కార్యదర్శి చీకురి బిక్షం మాట్లాడుతూ ఏప్రిల్ 6,7 తేదీలలో నల్గొండ పట్టణ కేంద్రంలో యుటిఎఫ్ కార్యాలయంలో ఈ మహాసభలను నిర్వహిస్తున్నట్టు, ఈ మహాసభలకు జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేయబడిన 400 మంది వివిధ సాంస్కృతిక రంగాల కళాకారులు హాజరవుతున్నట్టు తెలియజేశారు.
ప్రజానాట్యమండలి దశాబ్దాల కాలంగా ప్రజలను చైతన్యం చేస్తూ అనేక ప్రజా కళారూపాలను ప్రదర్శిస్తూ “కల కల కోసం కాదు కల ప్రగతి కోసం”అనే నినాదంతో ముందుకు సాగుతుందన్నారు. ప్రకృతి నుంచి సమాజం వరకు ప్రతిదానికి చైతన్యమే పురోగమనానికి మూలమని తెలిపారు. 82 సంవత్సరాల నుంచి ప్రజల జీవితాలతో భాగమై, ప్రజా,శ్రామిక వర్గాల నుంచి పుట్టిన జానపద కళలను ముందుకు తీసుకెళ్తూ, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అనేక మంది కళాకారులను వెలికి తీసి ప్రజానాట్యమండలి కళాకారులకు తగిన గుర్తింపునిస్తుందని కొనియాడారు.
ప్రస్తుతం ప్రపంచీకరణ ప్రభావంతో కలలు నిర్వీర్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వాన్ని కలిగిన నల్లగొండ జిల్లాలో ఈ మహాసభలను సాంస్కృతిక ఉత్సవాలుగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యుదయవాదులు, కళాకారులు, ప్రజలు, మేధావులు అందరూ పాల్గొని మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి మండల అధ్యక్షులు వంటేపాక అయోధ్య, ప్రజా సంఘాల నాయకులు వరికుప్పల ముత్యాలు, మిరియాల భరత్, వేముల లింగస్వామి, ప్రజానాట్యమండలి మండల సహాయ కార్యదర్శి పగిళ్ల యాదయ్య, మండల కమిటీ సభ్యులు పందుల సంపూర్ణ, ఆకారపు లలిత తదితరులు పాల్గొన్నారు.



