టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహులు
నవతెలంగాణ – మిడ్జిల్
డిసెంబర్ 28, 29 తేదీలలో జనగామలో టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా వైజ్ఞానిక సదస్సును జయప్రదం చేయాలని యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ నరసింహులు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాల ఆవరణలో టీఎస్ పిటిఎఫ్ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల విద్యాధికారి సరస్వతి మండల అధ్యక్షులు వెంకటయ్యతో కలిసి వాల్ పోస్టర్, కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యా రంగ పరిరక్షణ కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం సంఘం ఎప్పుడూ సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. సమస్యల కోసం నిరంతరం పోరాటం చేసి అనేక సమస్యలు సాధించుకోవడం జరిగిందని అన్నారు. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు రావలసిన డి ఏ లను, పి ఆర్ సి ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల పెండింగ్ బిల్స్ మంజూరు చేయాలని, ప్రమోషన్ ల వల్ల పాఠశాలల్లో ఏర్పడిన ఖాళీలను వెంటనే ఉపాధ్యాయుల నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రమేష్ ,లక్ష్మయ్య, రమేష్ గౌడ్ పరిమళ కుమారి, లలిత , నర్సిములు, కరుణాకర్, మండలంలోని వివిధ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



