– సీఐటీయూ రాష్ట్ర కమిటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలు ఈ నెల 25-28 వరకు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం నగరంలో జరిగే ప్రదర్శన, బహిరంగ సభలో రాష్ట్రంలోని మహిళా కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఐద్వా ఏర్పాటు నుంచి మహిళల హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం. కోసం నిరంతరం కృషి చేస్తున్నదని తెలిపారు. ఇతర మహిళా సంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి చేసిన ఐక్య ఉద్యమాల ఫలితంగా ఆస్థి హక్కు చట్టం, వరకట్నం వేధింపుల నిరోధక చట్టం ఐపీసీ 498 ఏ, గృహ హింస నిరోధక చట్టం, స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013 మొదలైన చట్టాలను సాధించిందని పేర్కొన్నారు. ఉచిత న్యాయ సలహా కేంద్రాల ద్వారా ఎందరో మహిళల వేదనకు ఊరట కలిగించిందని తెలిపారు. మహిళా సాధికారతకు ఐద్వా చేస్తున్న కృషిలో భాగంగా ఈ మహాసభలో మరిన్ని చారిత్రాత్మక నిర్ణయాలు చేయాలనీ, వాటి అమలు కోసం సీఐటీయూ భాగస్వామి అవుతుందని పేర్కొన్నారు.
ఐద్వా 14వ జాతీయ మహాసభలను జయప్రదం చెయ్యండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



