– మహిళలకు ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు
– సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
జనవరి 25 నుంచి 28 వరకు నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లోని టీజీఆర్టీసీ కల్యాణమండపంలో జరుగనున్న అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.అరుణజ్యోతి, మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మహిళలపై కొనసాగుతున్న వివక్ష, దాడులు, చట్టబద్దంగా వారికి రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన, సుప్రీంకోర్టు నిర్దేశించిన సమాన పనికి సమాన వేతనం, వితంతు పెన్షన్లు, చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు తదితర అంశాలపై మహాసభలో చర్చించి తీర్మాణాలు చేయనున్నట్టు తెలిపారు. మద్యం, అశ్లీలత వంటి సామాజిక మాద్యమాలే మహిళలపై జరుగుతున్న దాడులకు కారణమని విమర్శించారు. ప్రభుత్వాలు వీటి కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 33 శాతం మహిళా రిజర్వేషన్ చట్టం అమలులో ఘోరంగా విఫలమైందనీ, వెంటనే చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని అన్నారు. బీజేపీ అధికారం చేపట్టి నప్పటి నుంచి రాష్ట్రంలో, దేశంలో స్త్రీలపై సాంస్కృతిక దాడి ఎక్కువైందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల వస్త్ర దారణ కేంద్రంగా జరుగు తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని వ్యాఖ్యానించారు. చాలి చాలని వేతనాలతో ఏ రోజుకారోజు గడుపుకుంటున్న పేద మహిళలు పోషకాహర లోపంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 14 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలు 50 శాతం రక్త హీనతతో బాదపడుతున్నారని గుర్తు చేశారు. 127 దేశాల ఆకలి సూచికలో ఇండియా 105వ స్థానంలో ఉండటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మనువాదం, సామ్రాజ్యవాదం, మహిళల హక్కులు, రాష్ట్రంలో మహిళా సంఘాల ఐక్య కార్యచరణ ఏర్పాటు, బలమైన పోరాటాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించనున్నట్టు వారు తెలిపారు. 25న బస్ భవన్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి మహిళలు వేలాదిగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కెఎన్.ఆశాలత, బుగ్గవీటి సరళ, లక్ష్మమ్మ, కవిత, రజిత, పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



