Saturday, September 13, 2025
E-PAPER
Homeజిల్లాలుసాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సభలను జయప్రదం చేయండి

సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సభలను జయప్రదం చేయండి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జహంగీర్
నవతెలంగాణ – వలిగొండ రూరల్

సెప్టెంబర్ 16, 17 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా 15 కేంద్రాల్లో జరుగు వీర తెలంగాణ సాయుద రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా జరుగు సభలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జహంగీర్ పిలుపునిచ్చారు. శనివారం రోజున వలిగొండ మండల కేంద్రంలో సిపిఐ(ఎం) పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శివర్గ సభ్యులు మెరుగు వెంకటేశం అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జహంగీర్ మాట్లాడుతూ .. ఈనెల 16,17 తేదీల్లో జిల్లా వ్యాప్తంగా 15 వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కేంద్రాల్లో సభలు నిర్వహించడం జరుగుతుందని ఆనాటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన వారి స్తూపాల వద్ద నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను కలుస్తామని అన్నారు.

ఆనాటి పోరాట స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకుపోవడానికి సీపీఐ(ఎం) జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఆనవాయితిగా నిర్వహిస్తుందన్నారు. ఈ పోరాటానికి ఏమాత్రం సంబంధంలేని బిజెపి దాని అనుబంధ సంస్థలు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించి హిందూ ముస్లింల మధ్య తగాదాగా చిత్రీకరించేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుందని ప్రజల్లో మత ఉద్రేకాన్ని సృష్టించి తమ ఎజెండాను అమలు చేసుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రజలందరూ మతోన్మాద భావజాలంతో ముందుకు వస్తున్న బిజెపి తప్పుడు ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. నాడు తెలంగాణ ప్రాంతంలో దొరలు,జాగిర్దారులు,పటేల్ పట్వారిలు, ఈ ప్రాంత ప్రజలను దోచుకు తింటూ నాటి నైజాం రజాకారుమూకలతో కుమ్మక్కయ్యారని నాడు ప్రజలను పట్టిపీడిస్తూ పన్నులను వసూలు చేయడమే కాకుండా వారి చేత వెట్టిచాకిరి చేయించారని దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యపరిచి దొరలు, జాగిర్దారులు, పటేల్,పట్వారిలకు, నైజాం రజాకార్ మూకలకు వ్యతిరేకంగా జరిపిన మహోన్నత పోరాటమే వీర తెలంగాణ సాయుధ  రైతాంగ పోరాటమని గుర్తు చేశారు.

జిల్లాలో 16వ తేదీ రోజు ఉదయం రాజపేట మండలం రేణికుంట అమరుడు రేణికుంట రామిరెడ్డి స్థూపం నుండి ప్రారంభమైన ఈ యాత్ర యాదగిరిగుట్ట మండలం కాచారం మీదుగా కొలనుపాక ఆలేరు గుండ్లగూడం గుండాల నుండి వలిగొండ మండలం పులిగిల్ల, సుంకిశాల గ్రామాల్లో సభతో ముగుస్తుందని, 17వ తేదీ రోజు బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లి అమరుడు పెద్దన్న స్మారక స్థూపం నుండి ప్రారంభమై వెంకిర్యాల, పోచంపల్లి మండలం పిలాయిపల్లి, నారాయణపురం మండలం గుడిమల్కాపూర్, నుండి భువనగిరి మండలం రావి నారాయణరెడ్డి స్తూపం నాగిరెడ్డిపల్లి వరకు చేరుకొని రాత్రికి మునిపంపుల గ్రామంలో జరిగే సభతో ముగుస్తుందని తెలిపారు. ఈ సభల్లో ప్రజలందరూ కమ్యూనిస్టు పార్టీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా  నేడు దేశంలో అధికారంలో ఉన్న బిజెపి కార్పొరేటు అధిపతులకు వేలకోట్లు కట్టబెడుతూ  దేశ ప్రజలపై పెద్ద ఎత్తున భారాలను వేస్తుందన్నారు. మొన్నటి వరకు అమెరికా విషకౌగిలికి వంతపాడి డ్రోనాల్డ్ ట్రంప్ ను మంచి మిత్రుడు అంటూ ఇతబోధ చేసిన దేశ ప్రధాని మోడీ చర్యల వల్ల దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత దెబ్బతిన్నదని ఇటీవల ఆర్బిఐ మాజీ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయన్నారు.భారత్ పై ట్రంప్ మైండ్ గేమ్ ఆడుతున్నాడని అది గ్రహించకపోతే భారత్ కు తీవ్రమైన నష్టం జరుగుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిక చేస్తున్నారని గుర్తు చేశారు. ట్రంప్ సుంకాలు భారతదేశన్ని మాత్రమే కాకుండా అమెరికా కూడా స్వయం వినాశకంగా మారుతుందని అన్నారు.

 ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పాడైపోయిన రోడ్లు కల్వర్టులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెంటనే మరమ్మతులు చేయడానికి తక్షణ చర్యలు చేపట్టాలని, పంట నష్టపోయిన రైతులందరికీ వెంటనే ప్రభుత్వం గుర్తించి పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూర శ్రీనివాస్, కందడి సత్తిరెడ్డి, మండల కమిటీ సభ్యులు కర్ణకంటి యాదయ్య, దుబ్బ లింగం, కవిడే సురేష్,భీమనబోయిన జంగయ్య,బూడిద మణెమ్మ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -