Thursday, July 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆవాజ్‌ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

ఆవాజ్‌ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

- Advertisement -

– తెలంగాణ గ్రంథాలయాల సంస్థ చైర్మెన్‌ రియాజ్‌ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

మైనార్టీల హక్కుల సాధనకు, లౌకికవాదం కోసం కృషి చేస్తున్న ఆవాజ్‌ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ గ్రంథాలయాల సంస్థ చైర్మెన్‌ డాక్టర్‌ ఎండి.రియాజ్‌ పిలుపునిచ్చారు. ఆవాజ్‌ 3వ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి.అబ్బాస్‌తో కలిసి హైదరాబాద్‌లోని లైబ్రరీల సంస్థ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీల ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య, ఉపాధి తదితర సమస్యలపై ఆవాజ్‌ కృషి చేస్తున్నదని కొనియాడారు. లౌకికవాదం, మతసామరస్యం కోసం పాటుపడుతున్న ఆవాజ్‌ మహాసభలకు అందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్‌ హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా నాయకులు అబ్దుల్‌ సత్తార్‌, అబ్దుల్‌ లతీఫ్‌, నసీరుద్దీన్‌, మెహబూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -