నవతెలంగాణ – జన్నారం
42 శాతం బీ సీ రిజర్వేషన్ల సాధనకై బీ సీ రిజర్వేషన్ల బిల్లును 9 వ షెడ్యూల్ లో చేర్చాలనే డిమాండ్ తో అక్టోబర్ 24 శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బీపీ “మహా ధర్నా” నిర్వహించబోతున్నారనీ బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ కాసెట్టి లక్ష్మణ్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలో పత్రికా విలేకరులతో మాట్లాడారు.
ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ( బీ సీ ఐ ఎఫ్) మేధావుల ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి టీ. చిరంజీవులు ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. ముఖ్య అతిథులుగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య వీరితో పాటు పెద్దలు విశారధన్ మహారాజు పాల్గొంటున్నారన్నారు. ఈ మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల నుంచి బీ సీ కులాలకు చెందిన అన్ని వర్గాల వారూ హాజరు కావాలని లక్ష్మణ్ కోరినారు.
ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ కోడూరి చంద్రయ్య , కో కన్వీనర్ లు కడార్ల నరసయ్య , మూల భాస్కర్ గౌడ్ మంచిర్యాల జిల్లా కన్వీనర్ ఆడేపు లక్ష్మీనారాయణ ఖానాపూర్ నియోజకవర్గ కో కన్వీనర్ ఆండ్ర పురుషోత్తం , జన్నారం మండల బీసీ సంఘం అధ్యక్షుడు గూడ అశోక్ , మహేంద్ర సంఘం నాయకుడు కోడి జుట్టు రాజయ్య , పిల్లి మల్లయ్య జన్నారం మండల పూసల సంఘం మాజీ అధ్యక్షుడు గుడ్ల రాజన్న , కానుగంటి రాజన్న తదితరులు పాల్గొన్నారు.