నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ 
కల్వకుర్తి పట్టణానికి చెందిన పలువురు బిజెపి నాయకులు జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో వారు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తో కలిసి ఈరోజు శ్రీ నగర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మొగిలి దుర్గాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు బోడ నరసింహ,జిల్లా నాయకులు నిరుకంటి రాఘవేందర్ గౌడ్, ధన్నోజు నరేష్ చారి, లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు. దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఇచ్చే పడుతున్న పథకాలను ప్రజలకు వివరించారు. దేశంలో మోడీ చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ప్రజలు బిజెపిని ఆదరిస్తారని, బిజెపి అభ్యర్థి జూబ్లీహిల్స్ లో ఘనవిజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జూబ్లీహిల్స్ లో బీజేపీ అభ్యర్థిని గెలిపించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

 
                                    