Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్సు యాత్రను విజయవంతం చేయండి 

బస్సు యాత్రను విజయవంతం చేయండి 

- Advertisement -

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మౌనేందర్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టే బస్సు యాత్రను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫెడరేషన్ మండల అధ్యక్షుడు కుమ్మరి కుంట్ల మహేందర్ కోరినట్లు తెలిపారు. మండల కేంద్రంలో సన్నాహక సమావేశాన్ని గురువారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధనే దేయంగా నిధులు నీళ్లు నియామకాలు అనే సిద్ధాంతంతో అహర్నిశలు కష్టపడి అనేక రకాలుగా నష్టపోయి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది అని తెలిపాడు.కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం పూర్తయినప్పటికీ ఉద్యమకారులకు గత ప్రభుత్వాo న్యాయం చేయలేదని  ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారుల హక్కుల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించడం జరుగుతుంది.

 ఈ బస్సు యాత్రలో భాగంగా టి యు ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్  ఈనెల 20వ తేదీన జనగాం జిల్లా నుండి ప్రారంభమైన బస్సు యాత్ర స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, మీదుగా నెల్లికుదురు మండలానికి చేరుకుంటుంది. కావున ఇట్టి బస్సు యాత్రను తెలంగాణ ఉద్యమకారులు, ప్రజా సంఘ నాయకులు, మండల ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు, గుండా వెంకన్న. పెరుమాళ్ళ పుల్లయ్య, దండెంపెల్లి సైదులు, దాసరి ప్రకాష్, మాదరి ప్రశాంత్, మద్ది వెంకన్న, కొమురయ్య, హెచ్ అశోక్, అలకుంట్ల సాయిలు, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -