Thursday, December 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి

సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి

- Advertisement -

ఎర్రజెండా తోనే ప్రజల సమస్యలు పరిష్కారం
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య
నవతెలంగాణ – నెల్లికుదురు 

ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్థులు మాత్రమే గెలిపించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య పిలుపునిచ్చారు. గురువారం మునిగిలవీడు గ్రామంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ చట్టాన్ని, గిరిజనులకు గిరిజనేతరులకు అటవీ హక్కుల చట్టాన్ని రైట్ ఇన్ఫర్మేషన్ ఆక్ట్ చట్టన్ని తేవడంలో కమ్యూనిస్టుల పాత్ర ముఖ్యమైనదని అన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలకే పరిమితం తప్ప అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు. కార్పొరేట్ వ్యవస్థకు అనుకూలంగా స్పందించినంత పేద ప్రజల జీవన స్థితిగతులపై స్పందించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చెందారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఎర్రజెండాని మార్గమని అందుకోసం సీపీఐ(ఎం) బలపరచిన సర్పంచ్ అభ్యర్థి ఇసంపేల్లి సంగీతను, వార్డు మెంబర్లను అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో  గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నెల్లికుదురు మండల కార్యదర్శి ఇసంపెల్లి సైదులు నాయకులు సత్యం, సత్యనారాయణ, మచ్చ వెంకన్న ,ఎస్కే యాకుబు, బోడ మంగ్య, భూక్య బిక్షపతి ,పాయలి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -