యాదవ సంఘం మండల అధ్యక్షుడు కాసాని శ్రీషేలం యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ సెంటర్ లో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకను ఈ నెల16వ తేదీన శనివారం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్నీ మండలంలోని అన్ని గ్రామాల యాదవ్ సంఘం నాయకులు, యాదవులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యాదవ సంఘం మండల అధ్యక్షుడు కాసాని శ్రీషేలం యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని కొయ్యుర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించి యాదవుల ఐక్యతను చాటేందుకు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజాప్రతినిధులుగా గెలిపించుకొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు యాదండ్ల రామన్న యాదవ్,బొంతల రాజు యాదవ్,డివిజన్ నాయకుడు కోడారి చినమల్లయ్య యాదవ్ పాల్గొన్నారు.
శ్రీకృష్ణాష్టమి వేడుకలను విజయవంతం చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES