బుర్ర శ్రీనివాస్ గౌడ్ కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – గోవిందరావుపేట
దీర్ఘకాలికంగా అపరిచికృతంగా ఉన్న కల్లుగీత కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఈనెల 28న నిర్వహించ తలపెట్టిన చలో సూర్యాపేట కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కల్లుగీతా కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని తాటి వనంలో మండల గీత కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు వత్సవాయి సారయ్యల ఆధ్వర్యంలో చలో సూర్యాపేట గోడపత్రిక ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కల్లు గీత కార్మికులుసమస్య పరిష్కారం కొరకు సర్వాయి పాపన్నా గౌడ్ స్పూర్తితో పోరాటాలకు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.ఏజెన్సీ పేరుతో రద్దు చేసిన సోసైటీ లను తక్షణమే పునరుద్దరణ చేయాలన్నారు.
ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నాకల్లు గీత కార్మికుల సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.కల్లు గీత కార్మికుల కు ఎన్నికలముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ ఈనెల 28 న కల్లు గీత రణభేరి పేరుతో సూర్యాపేట లో కేజీకేస్ రాష్ట్ర 4 వ బహిరంగ జరుగుతుందని దీనికి మండలం నుండి ఇంటికో గౌడ్ ఊరికో వాహనం తో కదిలి రావాలని వారు గీత కార్మికుల కు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో సంఘం సీనియర్ నాయకులు కాసగాని బిక్షం గౌడ్ మండల ఉపాధ్యక్షుడు మేరుగుసుధాకర్ గౌడ్ కొండ వీరేషం గౌడ్ బండపెల్లి సాంబయ్య గౌడ్.వేముల కృష్ణ గౌడ్ బుస్సాపూర్ సోసైటీ అధ్యక్షులు రాజుగౌడ్ బొమ్మగాని జగదీశ్వర్ గౌడ్ జక్కు వేణుగోపాల్ గౌడ్ చిదురాల దుర్గ ప్రసాద్ గౌడ్ చంద్రయ్య గౌడ్ గుండేటి రాజుగౌడ్ సారి బాబుగౌడ్ మిట్ట ఉప్పలయ్య గౌడ్ తో పాటు 30 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.



