Monday, November 17, 2025
E-PAPER
Homeఖమ్మంసీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి..

సీఐటీయూ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి..

- Advertisement -

మధ్యాహ్నం భోజనం వర్కర్లకి పెండింగ్ బిల్లులు జీతాలు తక్షణమే విడుదల చేయాలి..
నవతెలంగాణ – మణుగూరు
సిఐటియు జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని, మధ్యాహ్న భోజనం వర్కర్లకు పెండింగ్ బిల్లులు, జీతాలు తక్షణమే విడుదల చేయాలని సిఐటియు జిల్లా నాయకులు సత్రపల్లి సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం భోజనం వర్కర్ల సమావేశం  శ్రామిక భవన్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే  మధ్యాహ్నం భోజనం వర్కర్ల సమస్యలు  రోజురోజుకు పేరుకుపోతున్నాయని అన్నారు.  నెలలు గడుస్తున్న  జీతాలు వంట బిల్లులు  నేటికి పడలేదని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు  కిరాణా షాపుల దగ్గర  అప్పులు చేస్తున్నారన్నారు. సరుకులు తీసుకొస్తూ పిల్లలకి వడ్డిస్తున్నారని అన్నారు  రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వారి బిల్లులు పట్ల గాని, వారి జీతాల విషయంలో గాని  స్పందించట్లేదన్నారు.

తక్షణమే  పెండింగ్ జీతాలు  బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారికి వంట చేసే సమయంలో పొగ వల్ల. మరియు కంటిచూపు  ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం  ఇన్సూరెన్స్  మరియు పిఎఫ్ ఈఎస్ఐ  సౌకర్యం కల్పించాలని అన్నారు. లేని పక్షంలో  సీఐటీయూ ఆధ్వర్యంలో  ఆందోళన పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు  సీనియర్ నాయకులు కొడిశాల రాములు మాట్లాడుతూ .. 40 సంవత్సరాల తర్వాత  సిఐటియు జిల్లా మహాసభలు మణుగూరు పట్టణంలో జరుగుతున్నాయని అన్నారు. ఈ మహాసభలకు   పట్టణ ప్రజలు కార్మికులు అందరూ సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. మహాసభలు జయప్రదం చేయాలని అన్నారు.  ఈ సమావేశంలో  మధ్యాహ్నం భోజనం వర్కర్ నాయకురాలు, డి రమాదేవి, ఎం మునెమ్మ, కే సరిత, సిహెచ్ విజయ, కృష్ణవేణి, లలిత, నాగరత్నం, మనీ,చంద్రమ్మ, పుష్ప, మనీ,చంద్రమ్మ,పుష్ప, జి సీత  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -