Sunday, November 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించండి

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించండి

- Advertisement -

బీఆర్‌ఎస్‌ గెలిస్తే బీజేపీకే ఉపయోగం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ను గెలిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్‌లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మ, ఈటీ నర్సింహాతో కలిసి విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌ గెలిస్తే బీజేపీకే ఉపయోగమని చెప్పారు. బీఆర్‌ఎస్‌వి నిలకడ లేని విధానాలని విమర్శించారు. ఆ రెండు పార్టీల మధ్య ఆంతరంగిక దోస్తానం కొనసాగుతున్నదని తెలిపారు. లౌకిక, సామాజిక, సామ్రాజ్య వాద విషయాల్లో బీజేపీకి అది అనుకూలంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. కేసుల సమస్యతో కేంద్రంతో ఘర్షణ పడేందుకు సిద్దంగా లేదని చెప్పారు.

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు కూడా బీజేపీకి మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు. దేశంపై ట్రంప్‌ విధించిన సుంకాల పట్ల మోడీ మౌనంగా ఉండటం తగదన్నారు. ఆయన అమెరికాకు లొంగిపోయాడని విమర్శించారు. అలీన విధానాన్ని మంటగలుపుతున్నారని దుయ్యబట్టారు. కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా డిసెంబర్‌ 26న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపారు. నేపాల్‌లో కమ్యూస్టులు ఐక్యమయ్యారనీ, మన దేశంలో కూడా ఆ విధంగా విలీనమైతే మంచిదని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -