జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపు
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఈనెల 30న సీపీఐ(ఎం) జిల్లా విస్తృత సమావేశం నాందేవార్డ్ లోని పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నాము. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరవుతున్నట్లు జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు తెలిపారు. ప్రధానంగా ఇటీవల తమిళనాడులోని మధురై లో జరిగిన పార్టీ అఖిల భారత మహాసభల్లో తీసుకున్న కర్తవ్యాల్లో భాగంగా జిల్లాలో ఉన్న పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకు అవగాహన కల్పించడం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లో వివరించి వారిని చైతన్యం కల్పించడంతోపాటు పోరాటాల్లోకి తీసుకురావడానికి ఈ సమావేశం దోహదపడుతుందని అన్నారు. పార్టీ అఖిల భారత మహాసభ నిర్ణయాలను జిల్లా కార్యకర్తలకు వివరించటానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి హాజరవుతున్నారని తెలిపారు. రాబోయే కాలంలో మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను నిర్వహించే కర్తవ్యాల్లో భాగంగా ఈ సమావేశం కృషి చేస్తుందని తెలిపారు. అందువల్ల ఈ సమావేశానికి జిల్లాలోని పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
ముదిగొండ అమరవీరులకు నివాళులు..
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు సాగు భూముల కొరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగిన భూ పోరాటంలో 2007వ సంవత్సరంలో జరిగింది. ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రాంతంలో జరిగిన భూ పోరాట సందర్భంగా పెద్ద ఎత్తున సాగిన పోరాటంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో7 గురు కార్యకర్తల్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ పోరాటoతో రాష్ట్ర వ్యాప్తంగా భూ పోరాటాలు విస్తృతంగా కొనసాగాయి. అమరవీరులను స్మరిస్తూ సోమవారంమ పార్టీ కార్యాలయంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు. పెద్ది వెంకట్ రాములు, నాయకులు శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.