నవతెలంగాణ – ధర్మసాగర్
గొర్ల కాపరులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల29 జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ను జయప్రదం చేయాలని గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా కార్యదర్శి కాడబోయిన లింగయ్య గొర్ల కాపర్లకు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోయాదవ కమిటీ హాల్ లో మండల కమిటీ సమావేశం తొట్టె భీమన్న అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన లింగయ్య హాజరై మాట్లాడారు. గొర్రెలు, మేకలకు సంవత్సరానికి ఉన్న మూడుసార్లు నట్టల మందులు వేస్తామని చెప్పి రెండు సంవత్సరాలు దాటుతున్న ఒక్కసారి కూడా నట్టల మందులు చేయకపోవడం చాలా దారుణమని అన్నారు.50 సంవత్సరాలు దాటిన గొల్ల కాపరులందరికీ ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని,ప్రమాదవశాత్తు మరణించడం గొల్ల కాపరులకు పదివేల ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని, గోర్లు మేకలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గొర్రెల పంపిణీ రెండు లక్షలు నగదు బదిలీ ద్వారా అమలు చేయాలని కోరుతూ ఈ నెల 29న హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు గొర్ల మేకల పెంపకం దారులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఈ సందర్భంగా గొర్ల కాపరులకు పిలుపునిచ్చారు. గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జి సమ్మయ్య ఈ మధ్యకాలంలో ప్రభుత్వం గొర్రెల. మేకలకు వేసిన బ్లూ టంగ్ ఇంజక్షన్ వల్ల గొర్రెలు మేకలకు సొల్లు తగ్గలేదు కానీ గొర్ల మేకలకు సొల్లు ఎక్కువైందని విమర్శించారు.దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం నకిలీ బ్లూ టంగ్ పంపిణీ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే దానిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం జిఎంపిఎస్ మండల కార్యదర్శి మామిడి కుమార్ మాట్లాడుతూ ఈనెల 29న జరిగే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు మండలంలోని గొర్ల కాపరులు అందరూ హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు.తోట్టే భీమన్న,మామిడి కుమార్,మండల ఉపాధ్యక్షులు కాసాని పరశురాములు,సొసైటీ అధ్యక్షులు గంటే సాంబరాజు, కొలిపాక రాజయ్య,సాంబరాజు, తూముల కుమారస్వామి,మంద రాజు,రొండి చిన్న రాజయ్య తదితరులు పాల్గొన్నారు.



