Saturday, October 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హెచ్ఎండీఏ ఆఫీస్ ముందు ధర్నాను జయప్రదం చేయండి

హెచ్ఎండీఏ ఆఫీస్ ముందు ధర్నాను జయప్రదం చేయండి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర మిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

రీజనల్ రింగ్ రోడ్డులో (ఆర్ఆర్ఆర్) భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని, ఆలైన్మెంట్ ను మార్చాలని, భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వాలని ఈ నెల 6న సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో హైదరాబాదులోని హెచ్ఎండీఏ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న “ధర్నా” లో నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. శనివారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో రీజనల్ రింగ్ రోడ్ లో భూములు కోల్పోతున్న రైతులతో కలిసి భూములను సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది.

ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ.. రైతులతో మాట్లాడకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా, భూమి సేకరణలో స్పష్టతనివ్వకుండా బలవంతంగా భూములను తీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే రైతుల నుండి తీవ్రమైన ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో బస్వాపురం ప్రాజెక్టు, కాలువలకు, రోడ్లకు పెద్ద ఎత్తున రైతులు భూములు కోల్పోయారని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు ఒక రింగ్ రోడ్డు నుంచి ఇంకో రింగ్ రోడ్డు మధ్యన 40 కిలోమీటర్ల పరిధి ఉండాలని ఉన్న ఎందుకు దానిని అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంత్రుల, ఎమ్మెల్యేల, పెట్టుబడిదారుల, రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములు కాపాడడానికి అలైన్మెంట్ మార్చారని విమర్శించారు.

100 మీటర్ల వెడల్పుతో రోడ్డును నిర్మించాలని హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ఇచ్చిందని, రైల్వే ట్రాక్ కోసం మరొక 40 అడుగుల వెడల్పుతో రోడ్డును పెంచుతామని ప్రభుత్వం చెబుతున్నదని తెలిపారు. ఇంతకు ముందు మొదటి అలైన్ మెంట్ తయారుచేశారనీ, తర్వాత దాన్ని మార్చి రెండోసారి ఆలైన్మెంట్,  ఇప్పుడు మూడో అలైన్మెంట్ను తయారుచేసి విడుదల చేశారని ఇందులో రాజకీయ అండదండలు, డబ్బు, పలుకుబడి ఉన్న వారి భూముల జోలికి వెళ్లకుండా ఎకరం , రెండు, మూడెకరాలున్న చిన్న, సన్నకారు రైతులకు సంబంధించిన భూములున్న ప్రాంతాన్నే రింగ్ రోడ్డు కోసం తీసుకుంటున్నట్లుగా పెద్దఎత్తున ఆరోపణలొస్తున్నాయని గుర్తు చేశారు.

ఇప్పటికైనా 2013 చట్టం ప్రకారం గ్రామ సభలు పెట్టాలని, భూమికి భూమి ఇవ్వాలనీ, మార్కెట్ రేటుకు మూడింతలు అదనంగా చెల్లించాలనే డిమాండ్స్ తో ఈనెల 6వ తెదీన నిర్వహిస్తున్న “ధర్నా” లో రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నర్సింహ కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్ , మండల కార్యదర్శివర్గ సభ్యులు కొండ అశోక్, గ్రామ శాఖ కార్యదర్శి కూకుట్ల కృష్ణ , రైతులు కొండ పెద్ద వెంకటేష్, జక్కుల మల్లెశ్ , కొండ రమేష్, బబ్బురి రాజు, మాకోళ్ల మాకోళ్ల నర్సింహ, రాంపల్లి చంద్రయ్య, కొండ సాగర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -