Wednesday, August 27, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుఎమర్జెన్సీపై జిల్లా సదస్సును జయప్రదం చేయండి: సీపీఐ(ఎం)

ఎమర్జెన్సీపై జిల్లా సదస్సును జయప్రదం చేయండి: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాల అయిన సందర్భంగా నాటి పరిస్థితి- నేటి పరిస్థితి, పైన జిల్లా సదస్సును జయప్రదం చేయాలి అని సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. ఈ మేరకు సోమవారం సీపీఐ(ఎం) జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎ. రమేష్ బాబు మాట్లాడుతూ.. భారతదేశంలో 1970 జూన్ 25న అప్పటి ప్రధానమంత్రి గాంధీ ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్య హక్కులను ఎమార్చి తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని ప్రయత్నించారని అన్నారు. నేటి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి అప్రకటితంగా ఎమర్జెన్సీ విధానాలను కొనసాగిస్తోందని అన్నారు. హిందుత్వ వాదాన్ని వ్యతిరేకించే వారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించిన వారిని జాతి ద్రోహులుగా, సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరిస్తూ స్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతుల్లో హిందుత్వ విధానాలను ఆమోదించిన వారే రాజ్యాంగాన్ని ఆమోదించినట్లుగా చూస్తున్నారని అన్నారు. ఇది లౌకికవాదానికి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టి లాంటిదని తెలిపారు.

ఈ విధానాలను ప్రజాస్వామిక వాదులు ప్రజలు ఎండగట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకొరకు ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను వివరిస్తూ ఈనెల 25న సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సదస్సును నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. ఈ సదస్సుకు పార్టీ కార్యకర్తలు శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు పిలుపునిచ్చారు. అమెరికా దురాహంకార దాడులను ఖండించాలని తెలియజేస్తూ జరిపే ఈ నిరసన కార్యక్రమానికి ప్రజలు ప్రజాసామికవాదులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, నూర్జహాన్, కమిటీ సభ్యులు సుజాత, విగ్నేష్, కార్యకర్తలు రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad