Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంపై జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయండి 

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంపై జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయండి 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పై నేడు ఆదివారం జిల్లా సదస్సును జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం సీపీఐ(ఎం) కార్యాలయంలో తెలంగాణ రైతంగ పోరాటం వాస్తవాలు, వక్రీకరణలు అనే అంశం పైన సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ వేసిన బుక్లెట్ ను జిల్లా పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు.

బుక్లెట్ విడుదల అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బాబు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో భూస్వాములు, జాకీర్దారులు, దొరలు పేదలతో వెట్టి చాకిరి చేయించుకోవడంతో పాటు వారి పైన దాడులు దౌర్జన్యాలు చేస్తూ నిజాం నవాబుకు కపం కట్టటానికి బలవంతంగా పన్నులు వసూలు చేయటన్ని నిరసిస్తూ భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పెద్ద ఎత్తున పేదలు కష్టజీవులు కలిసి కమ్యూనిస్టుల నాయకత్వంలో ఏర్పడిన ఆంధ్ర మహాసభ సంఘంలో సభ్యులుగా చేరి భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా నిజాం నవాబు నిరంకుశత్వాన్ని ఖండిస్తూ నువ్వు ఎదిరించి 4000 మంది ప్రాణాలు పోగొట్టుకున్న వెనకడుగు వేయకుండా మూడువేల గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసి పది లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉందని ఈ పోరాటాన్ని వక్రీకరిస్తూ చరిత్రను కించపరుస్తూ ఇది ఒక మత రాజుకు వ్యతిరేకంగా మరో మతం వారు పోరాడినట్టుగా బిజెపి శ్రేణులు ప్రచారం చేస్తున్నాయని అందుకు అనుగుణంగా రజాకారుల సినిమాను ప్రదర్శిస్తూ చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

వాస్తవ విషయాలను ప్రజలకు వివరించటం కొరకు జిల్లా కేంద్రంలో ఈనెల 14న ఆదివారం రోజు సదస్సు నిర్వహించటం జరుగుతుందని, ఈ సదస్సుకు సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి అబ్బాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. జెపి చేసే దుష్ప్రచారానికి తిప్పి కొట్టడానికి పార్టీల శ్రేయోభిలాషులు, లౌకిక ప్రజాతంత్ర వాదులు, పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, కార్యకర్తలు రాజు, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -