నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజాంబాద్ జిల్లా మూడవ మహాసభలను నవంబర్ 23వ తేదీన పెన్షనర్స్ భవన్ సుభాష్ నగర్ నిజామాబాద్ నందు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు గురువారం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల గురించి, ఈపీఎస్ పెన్షనర్ల సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్ల సమస్యలు చర్చిస్తామని, కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేస్తామని ఆయన తెలిపారు. ప్రధానంగా పెండింగ్ లో ఉన్న డి ఏల విడుదల పే డివిజన్ కమిషన్ రిపోర్టును వెంటనే విడుదల చేయాలని ఇంకా పెండింగ్ లో ఉన్న పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంఘం కృషి చేస్తుందని ఆయన అన్నారు.
జిల్లా నాయకులు శిల్ప హనుమాన్లు మాట్లాడుతూ నగదు రహిత వైద్యం ఎండమావిగా మారిందని, ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులలో హెల్త్ కార్డులను అనుమతించడం లేదని ఆయన అన్నారు. జిల్లా నాయకులు ఈవిల్ నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పాత పెన్షనర్లకు డిఏలు పే రివిజన్ వర్తించదని చట్టం చేసిందని వీటన్నిటిపై సమగ్రంగా చర్చిస్తామని వారు తెలిపారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో జిల్లా నాయకులు మధుసూదన్, భోజ రావు, ప్రసాద్, శిర్ప హనుమాన్లు, రామ్మోహన్రావు, ఈవీఎల్ నారాయణ, సాంబశివరావు, బిర్లా నాగేశ్వరరావు, రాధా కిషన్, చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.



