నవతెలంగాణ – కంఠేశ్వర్
ఈనెల 30వ తేదీన జరిగే విద్యాసంస్థల బందును జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేస్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) నిజామాబాద్ గర్ల్స్ కమిటీ స్థానిక నాందేవ్వాడ లోని కార్యాలయం లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్ మరియు బెస్ట్ అవేలేబుల్ స్కీం బకాయిలను విడుదల చేయాలని ఈ నెల 30 వ తేదీన బీటెక్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఐటిఐ కళాశాలలు బంద్ లో భాగంగా జిల్లా వ్యాప్త బంద్ జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా స్కాలర్షిప్ లో ఫీజు రియంబర్స్మెంట్లను రాష్ట్ర ప్రభుత్వం దీపావళి లోపు 600 కోట్లను విడుదల చేస్తామన్న హామీని నెరవేర్చకపోవడం సిగ్గుచేటని అన్నారు. అదేవిధంగా కళాశాల యాజమాన్యాలు ఫీజులు కడితేనే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉందని. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ కి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షురాలు దీపిక, గర్ల్స్ నాయకులు నీలిమ హేమ లత తదితరులు పాల్గొన్నారు.
30న విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి: ఎస్ఎఫ్ఐ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



