నవతెలంగాణ – నకిరేకల్ : జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈనెల 7 నుండి నిర్వహించే చెకు ముకి సైన్సు సంబరాలను విజయవంతం చేయాలని జెవివి రాష్ట్ర కమిటీ సభ్యుడు కనుకుంట్ల విద్యాసాగర్ గురుకుల పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సుకన్య కోరారు. శనివారం స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జే వి వి చెకు ముకి సైన్స్ సంబరాల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో 8, 9, 10 తరగతులు చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు పాఠశాల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో సైన్స్ లో రాత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 7 న పాఠశాల స్థాయి, 21న మండల స్థాయి పరీక్ష మండల కేంద్రాల్లో, 28న జిల్లా స్థాయి పరీక్ష జిల్లా కేంద్రాల్లో, డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో రాష్ట్ర స్థాయి పరీక్షలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సైన్స్ ప్రచార సంస్థ, జనవిజ్ఞాన వేదిక నిర్వహించే చెకుముకి సైన్స్ సంబురాలు విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించి సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో జెవివి జిల్లా కన్వీనర్ వంటెపాక నగేష్, నకిరేకల్ డివిజన్ కార్యదర్శి బుడిగె సుధాకర్, కళాశాల అధ్యాపకులు, పాఠశాల ఉపాధ్యాయులు యాదగిరి, మమత, అరుణ పాల్గొన్నారు.
చెకుముకి సైన్స్ సంబరాలు విజయవంతం చేయండి : విద్యాసాగర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



