Thursday, May 8, 2025
Homeతెలంగాణ రౌండప్సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

- Advertisement -

ప్రీమియర్ వద్ద సమ్మె పోస్టర్ ఆవిష్కరణలో సీఐటీయు రాష్ట్ర కార్యదర్శి భూపాల్ కార్మికులకు పిలుపు
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
: కేంద్ర ప్రభుత్వం అవలంబించే కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, లేబర్ కోడ్ ల రద్దును కోరుతూ మే 20న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో అన్నిరంగాల కార్మికులు  పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయు రాష్ట్ర  కార్యదర్శి కామ్రేడ్ భూపాల్  కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం, యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు లోని స్థానిక ప్రీమియర్ పరిశ్రమ వద్ద సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశంతో కలిసి పరిశ్రమ గేట్ వద్ద మే 20 సమ్మె పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం గతంలో పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను మోసగిస్తూ 4లేబర్ కోడ్ లను తీసుకువచ్చారని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చిన నుండి కార్పొరేట్ లకు 16 లక్షల 35 వేల కోట్లు మాఫీ చేశారని విమర్శించారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు కాలరాయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. 8గంటల పనిని 12గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని విమర్శించారు. కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికొద్యమం దెబ్బ తీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తుందని తెలియజేశారు. కావున కార్మిక ఐక్య పోరాటలను ఉదృతం చేస్తూ జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన మే 20 దేశ వ్యాపిత సమ్మెను కార్మిక వర్గ కర్తవ్యంగా భావించి ప్రతీ కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, యూనియన్ జనరల్ సెక్రెటరీ సిహెచ్ రమేష్, జిల్లా సహాయ కార్యదర్శి సుబ్బురు సత్యనారాయణ, పి గణేష్, బి వెంకటయ్య, జి నగేష్, ఎం వెంకటేష్,  టి ఎన్  టి యు సి నాయకులు రేగు బాల నరసయ్య, హెచ్ ఎం ఎస్ నాయకులు ఎస్ సంపత్,  డి చంద్రకుమార్, ఎం రాజు, ఐ ఎన్ టి యు సి  నాయకులు పి రాజిరెడ్డి, ఏ సిద్దయ్య, పి సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -