Sunday, May 11, 2025
Homeతెలంగాణ రౌండప్సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి 

సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి 

- Advertisement -

బిరెడ్డి సాంబశివ.. సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి 
నవతెలంగాణ – గోవిందరావుపేట
: సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) ములుగు జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో సీపీఐ(ఎం) పార్టీ మండల కమిటీ సమావేశం గుండు రామస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బి రెడ్డి సాంబశివ హాజరై మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు తీసుకోవచ్చు కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడం కోసం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కనీస వేతనాలు అమలు కావడం లేదని నల్ల చట్టాల పేరుతో మరోసారి దొడ్డి దారీణ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చి రైతన్న చేయడం కోసం ప్రయత్నిస్తుందని విమర్శించారు. ధరలు విపరీతంగా పెరిగాయని ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని అసంఘటిత రంగంలో ఉన్న ప్రజలకు కార్మికులకు భద్రత లేకుండా పోయిందని అన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఈనెల 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చిట్టిబాబు వెంకటరెడ్డి మండల కమిటీ సభ్యులు ఆదిరెడ్డి రామస్వామి ఐలయ్య నాగరాజు సదానందం కవిత రాజేశ్వరి రాజు నాగేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -