Friday, February 6, 2026
E-PAPER
Homeఖమ్మంసార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి

- Advertisement -

– సీఐటీయూ జిల్లా నాయకులు అర్జున్ 
నవతెలంగాణ – అశ్వారావుపేట

మోడీ నియంతృత్వాని నిరసనగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు అర్జున్ పిలుపునిచ్చారు. వ్యవసాయ కళాశాలలో పనిచేస్తున్న టైం స్కేల్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, యూనివర్సిటీ నాన్ టీచింగ్ సిబ్బందికి రూ.26 వేలు కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ కోరారు. 

ఈ నెల 12 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని శుక్రవారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, ఉద్యాన పరిశోధన కేంద్రం,కె మీలాయిడ్స్, వ్యవసాయ కళాశాలలో జరిగిన సమావేశాలలో అర్జున్ మాట్లాడుతూ.. బీజేపీ ఆధ్వర్యంలో ని, నరేంద్రమోడీ నేతృత్వంలో పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని కార్మికులని పారిశ్రామికవేత్తలకు బలిపెట్టేందుకే లేబర్ కోడ్ లు తీసుకువచ్చిందని అన్నారు.

కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు కార్మికులంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో వైద్యాధికారి డాక్టర్ రాధా రుక్మిణి కి హాస్పిటల్ శానిటేషన్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె నోటీసు అందజేశారు.  ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సాలార్, ఉమా రమేష్, వెంకటేశ్వరావు, రామారావు, శ్రీనివాసరావు, రాములు , ఇస్మాయిల్, నరసమ్మ, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -