Wednesday, January 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

- Advertisement -

– టాప్రా రాష్ట్ర కమిటీ పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ రిటైర్డ్‌ పర్సన్‌ అసోసియేషన్‌ (టాప్రా) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. మంగళవారం హైదరాబాద్‌లోని టాప్రా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు నారాయణరెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఆఫీస్‌ బేరర్ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర, కోల్‌, ఈపీఎఫ్‌ పెన్షనర్ల సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించారు. అందులో భాగంగా నేషనల్‌ పెన్షనర్స్‌ కోఆర్డినేషన్‌ కమిటీ పిలుపు మేరకు ఫిబ్రవరి 9,10,11 తేదీల్లో రాష్ట్రంలో ఉన్న ఈపీఎఫ్‌ కార్యాలయాల ముందు ధర్నా చేయాలని సమావేశం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలపై ఎన్సీసీపీఏ, ఎఫ్సీపీఏ పిలుపు మేరకు ఫిబ్రవరి 13న కేంద్ర ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నా చేయాలని నిర్ణయించారు. మొత్తంగా కేంద్ర, రాష్ట్ర, ఈపీఎఫ్‌, కోల్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్‌ సిటిజన్స్‌ సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు, కేంద్ర రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల పిలుపు మేరకు ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెలో పాల్గొనాలని రాష్ట్ర ఆఫీస్‌ బేరర్ల సమావేశం నిర్ణయించినట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం వ్యవస్థాపక నాయకులు ఎం.ఎన్‌.రెడ్డి మాట్లాడుతూ టాప్రా సంఘం దేశంలో ఒక ఆదర్శ సంఘం అని, అన్ని రకాల పెన్షనర్ల సమస్యలు పోరాడే సంఘమిదేనని అభినందించారు. ఈ కార్యక్రమంలో టాప్రా రాష్ట్ర కోశాధికారి అశోక్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగయ్య, నరహరి, డాక్టర్‌ లింగా అరుణ, జనార్దన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -