నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : ఈనెల 22, 23 తేదీలలో రాయగిరి గ్రామంలోని లింగ బసవ గార్డెన్లో జరిగే జిఎంపిఎస్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలను కోరుతూ భువనగిరి మండలంలోని తాజపూర్ గ్రామంలో సంబంధిత కరపత్రాన్ని జిఎంపిఎస్ మండల అధ్యక్షులు దేవునూరి బాలయ్య, జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. గొర్ల కాపరుల సమస్యల పరిష్కారం కోసం దశాబ్దం కాలంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి 1016, 559 జీవోల ను తీసుకొచ్చిందన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలని, నేషనల్ లైవ్ స్టాక్ విషయంలో గొల్ల కురుమలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి, గొర్రె మేకల పెంపకానికి ప్రాతన్యత ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాజ్ పూర్ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం సభ్యులు ర్యాకాల నర్సింహా, బిట్కూరి రాములు, బాలడా రవి, సోమన మహేష్, దేవునూరి భాస్కర్,గులాని సురేష్ లు పాల్గొన్నారు.
జిఎంపిఎస్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES