ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల చక్రపాణి
నవతెలంగాణ – పరకాల
ఈ నెల 26న జరుగనున్న హమాలి యూనియన్ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ ( సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల చక్రపాణి పిలుపునిచ్చారు. ఆదివారం పరకాలలో హమాలి కార్మికులతో కలిసి ఆయన మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ.. మహాసభల సందర్భంగా వేయి స్తంభాల గుడి నుండి అలంకార్ జంక్షన్ వరకు ర్యా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.హమాలి కార్మికులు ఎగుమతి దిగుమతి చేస్తున్న సందర్భంగా ప్రభుత్వానికి సెస్ ల రూపంలో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తున్న హమాలి కార్మికుల సంక్షేమాని ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం లేదన్నారు.సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
హమాలి కార్మికులకు ఇఎస్ఐ, పిఎఫ్ పని భద్రత ప్రభుత్వం నుండి గుర్తింపు కార్డులు అరులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని తదితర సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభలో చర్చించబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు తిక్క కమల్, బొచ్చు ఆదాం, నాయకులు గుర్రం బిక్షపతి, మేకల రాజు, మేకల రమేష్, పెండ్యాల రమేష్, తిరుపతి, కొయ్యల సందీప్, ఓడల పోషణ రాజు తదితరులు పాల్గొన్నారు.
హమాలీ మహాసభలను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES