Thursday, July 24, 2025
E-PAPER
Homeజిల్లాలుఖర్గే సభను విజయవంతం చేయండి..

ఖర్గే సభను విజయవంతం చేయండి..

- Advertisement -

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు..
నవతెలంగాణ – మల్హర్ రావు
: హైదరాబాద్ లోని ఎల్ బి స్టేడియంలో రేపు ఏర్పాటు చేస్తున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సభను విజయవంతం చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు పిలుపునిచ్చారు. గురువారం కాటారం మండలం ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ శాఖ అధ్యక్షులతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున కార్గే నేరుగా సమావేశం కావడం దేశంలోనే మొదటిసారని తెలిపారు. తెలంగాణ అనంతరం దేశవ్యాప్తంగా ఈ తరహా కార్యక్రమాలు ఉంటాయన్నారు.ఇంతటి ప్రాముఖ్యత ఉన్న సభ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. రేపు మధ్యాహ్నం 3:00 గంటలకళ్ళ మంథని నియోజకవర్గంలోని గ్రామ శాఖ అధ్యక్షులు మండల శాఖ అధ్యక్షులు జిల్లా శాఖ అధ్యక్షులు ఒకరికొకరు సమాచారం చేరవేసుకొని సమన్వయంతో సభకు హాజరుకావాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -