No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeతెలంగాణ రౌండప్ఉపాధి కార్మికుల ధర్నాను జయప్రదం చేయండి..

ఉపాధి కార్మికుల ధర్నాను జయప్రదం చేయండి..

- Advertisement -

వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం, చట్ట పరిరక్షణ కోసం రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలో ఉపాధి హామీ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య పిలుపునిచ్చారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని ముస్త్యాలపల్లి గ్రామంలో ధర్నాను జయప్రదం చేయాలని కూలీలతో కలిసి కరపత్రమును ఆవిష్కరించి, మాట్లాడారు. ఈ సందర్భంగా అంజయ్య పాల్గొని మాట్లాడుతూ సంవత్సరానికి 200 వందల రోజుల పని దినాల కోసం, రోజు కూలీ ఆరువందల కోసం, చట్టంలో ఉన్న హామీలు అన్ని అమలు చేయాలని, వేతనాలు వారం వారం ఇవ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రేపు అనగా 30వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలు ఉపాధి హామీ కార్మికులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేసి చట్టాన్ని పరిరక్షించుకోవాలని అంజయ్య తెలియజేశారు. 

 ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కళ్లెం లక్ష్మీనరసయ్య, వ్యవసాయ కూలీలు బోడ అంజయ్య, గంటెపాక బాలయ్య, పసునాది కిష్టయ్య, బోడ ఉపేంద్ర, గంటపాక అంజమ్మ, పసనాది లక్ష్మి, చిట్యాల యాదమ్మ, పసనాది లావణ్య, సురపంగా రేణుక, వడ్డే ఆగమ్మ, గడ్డం జయమ్మ, పసునాది మనమ్మ, పల్లపు లక్ష్మి, కళ్లెం సోలేమాన్ లు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad