Sunday, March 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ ఆర్టిజన్ల మహా ధర్నాను విజయవంతం చేయండి 

విద్యుత్ ఆర్టిజన్ల మహా ధర్నాను విజయవంతం చేయండి 

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
విద్యుత్ శాఖకు చెందిన ఆర్టిజన్లు, హన్మెన్‌లు, సిఎల్ మీటర్ రీడింగ్ కార్మికులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ ఆర్టిజన్ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కామారెడ్డి లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ మేరకు సోమవారం (30వ తేదీ) కామారెడ్డి జిల్లా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయం ముందు శాంతియుత మహాధర్నా నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా జేఏసీ నాయకులు ఎం. నాంపల్లి, కె. బాలేశం, సునీల్ మాట్లాడుతూ లు  విద్యుత్ కార్మికులు గత 20 – 25 సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న వేతనాలతో కుటుంబాన్ని పోషించడం  కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి, విద్యుత్ కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా మార్చి, ప్రమోషన్లతో కూడిన కన్వర్షన్ కల్పించాలని కోరారు.

తమ బతుకు పోరాటానికి విద్యుత్ శాఖ రెగ్యులర్ ఉద్యోగులు అండగా నిలిచి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మహా ధర్నా కార్యక్రమంలో కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -