Tuesday, July 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయండి: పల్లెర్ల అంజయ్య

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయండి: పల్లెర్ల అంజయ్య

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
  ఈనెల 23, 24 తేదీలలో బీబీనగర్ మండల కేంద్రంలో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య ఒక ప్రకటన ద్వారా తెలిపారు. అట్టడు వర్గాల హక్కుల కోసం కూలి పెంచాలని, భూమి పంచాలని, జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని పరిరక్షించాలని నిరంతరం అనేక పోరాటాలు నిర్వహిస్తూ వ్యవసాయ కార్మికులకు, పేదలకు అండగా నిలుస్తుంది వ్యవసాయ కార్మిక సంఘమని అన్నారు. 1936 లో ఏర్పడిన వ్యవసాయ కార్మిక సంఘం గ్రామీణ స్థాయిలో పెత్తందార్లు కొనసాగిస్తున్న ఆర్థిక దోపిడీకి, శ్రమ దోపిడీకి, సామాజిక అణిచివేతకు, కుల వివక్షతకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించిందని తెలిపారు.

దేశవ్యాప్తంగా మిగులు భూములను పేదలకు పంచాలని పోరాడి భూమిలేని పేదలకు లక్షలాది ఎకరాల భూమిని పంచిన చరిత్ర వ్యవసాయ కార్మిక సంఘానికి ఉందని అన్నారు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ ఇంకా అనేక మందికి ఇండ్లు, ఇండ్ల స్థలాలు, దున్నుకొని జీవించడానికి సెంట్ భూమి కూడా లేని వారు లక్షలాదిగా ఉన్నారని ఆవేదన వెలిబుచ్చారు. కేంద్రంలోని బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ నిరుద్యోగాన్ని పెంచుతుందని తెలిపారు. ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రలో భాగంగా ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ కొత్త కొత్త జీవోలు తెచ్చి ఉపాధికి ఉరి పెడుతుందని విమర్శించారు. 

మరోవైపు నిత్యవసర వస్తువుల ధరలు పెంచి, ప్రజా పంపిణీ వ్యవస్థనే లేకుండా చేయాలని చూస్తుందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలపైన, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూ సమస్యలపైన పోరాటాలను రూపొందించడానికి బీబీనగర్ లో నిర్వహిస్తున్న రాష్ట్రకమిటీ సమావేశాల్లో చర్చిస్తారని తెలియజేశారు. ఈ సమావేశాలకు ముఖ్య అతిధులుగా అఖిల భారత వ్యవసాయ కార్మిక జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నాగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములుతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొంటారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -