నవతెలంగాణ – అశ్వారావుపేట: తెలంగాణ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఆద్వర్యంలో ఎంపిక చేసిన పాఠశాల్లో నిర్వహిస్తున్న వేసవి శిబిరాలను గ్రామౌలోని ప్రతీ విద్యార్ధి సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో ప్రసాదరావు కోరారు. నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధుల కోసం నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణా శిబిరాన్ని మండల విద్యాధికారి ప్రసాదరావు మంగళవారం సందర్శించారు. విద్యార్ధులకు అందించే శిక్షణను రిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు వేసవి శిబిరాన్ని వినియోగించుకోవాలని,ఇతర గ్రామాలలో గురుకులాలు,ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులు ఎవరైనా సెలవులకు వచ్చిన వారు కూడా ఈ వేసవి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు.ఈ శిబిరంలో ఆటలు నేర్పించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పి.హరిత,ఉపాధ్యాయులు వూడల కిషోర్ బాబు,పుల్లయ్య, వెంకటేశ్వర్లు,పి.ఇ.టి రాజు, సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
వేసవి శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి: ఎంఈవో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES