Tuesday, May 6, 2025
Homeతెలంగాణ రౌండప్ మహిళా కూలీల జాతీయ సదస్సును జయప్రదం చేయండి

 మహిళా కూలీల జాతీయ సదస్సును జయప్రదం చేయండి

- Advertisement -

మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ పిలుపు….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: మే 9, 10 తేదీలలో కేరళ రాష్ట్రంలోని మల్లాపురం పట్టణంలో జరుగుతున్న మహిళ వ్యవసాయ కూలీల జాతీయ సదస్సులో మహిళా కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ పిలుపునిచ్చారు‌. సోమవారం భువనగిరి మండల పరిధిలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహిళా కూలీల సమస్యలను అధ్యయన కార్యక్రమానికి పద్మ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు.  దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయిన నేటికీ మహిళలు అన్ని రంగాలలో వివక్షత గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఎన్ని చట్టాలు ఉన్నా రోజురోజుకు మహిళల పైన దాడులు, దౌర్జన్యాలు హత్యలు, అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. మగవారితో సమానంగా పనిచేస్తున్న వేతనం కాడ మాత్రం వివక్షత చూపుతున్నారని మహిళలకు ఒకరకంగా, పురుషుల ఒకరకంగా వేతనాలు చెల్లిస్తున్నారని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలు వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రమకు తగ్గ వేతనాలు లేకపోవడం, మందులు పిచికారి చేసిన చెలల్లో పనిచేయడం వల్ల అనేక రకాలైన వ్యాధులకు గురవుతున్నారని, సరైన వేతనాలు లేక సరైన హారము తినక అనేక జబ్బుల పాలవుతున్నారని అన్నారు. ఇప్పటికైనా పాలకులు కనీస వేతనాలు చట్టాన్ని అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకమైన వైద్యము మహిళలకు అందించాలని, రక్షణ చట్టం తేవాలని కోరుతూ కేరళ రాష్ట్రంలో నిర్వహిస్తున్న మహిళా కూలీల జాతీయ సదస్సులో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పద్మ పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కూకుట్ల చొక్కాకుమారి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, గ్రామంలోని వ్యవసాయ కూలీలు అంతరి సత్తమ్మ, మాధవి, సువర్ణ, స్వాతి, కవిత, బొమ్మ కంటి బాలమణి, కొండ పోచమ్మ, అందె అఖిల లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -