నవతెలంగాణ – అశ్వారావుపేట : ఈ నెల 20న, జరిగే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల అఖిల పక్షం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేటలోని సీఐటీయూ సమన్వయంతో సీపీఐ కార్యాలయం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం హాజరైన నాయకులు మాట్లాడుతూ..కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలు మరింత దూకుడుగా అమలు చేస్తున్నది అని అన్నారు. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా వంద సంవత్సరాలు క్రితం సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు కోడ్ లను తెచ్చింది అన్నారు.వీటికి వ్యతిరేకంగా గత ఐదేళ్లు గా కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలతో అమలు వాయిదా పడింది అన్నారు. ఇప్పుడు వాటి అమలు చేసి కార్మికులకు పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తున్నది అని, 2025 – 26 బడ్జెట్లో తమ కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసింది అని, సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టింది. సామాన్యులపై భారాలు మోపి కార్పొరేట్ కొత్త సంస్థలకు పెట్టుబడిదారులకు వేల కోట్లు రైతులు ప్రకటించింది. ఉపాధి నిరుద్యోగం అధిక ధరలు ఆకలి అసమానతలు ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలు పట్టించుకోకపోవడం ఈ సమస్యలు మరింత తీవ్ర రూపం దాల్చి ఆర్థిక విధానాలను విచక్షణ రహితంగా అమలు చేస్తున్నది. కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానము వెనక్కి నెట్టేందుకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు నేందుకు కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు 2025 మే 25 చేయాలని నిర్ణయించాయి.ఈ సార్వత్రిక సమ్మెకు సంయుక్త కిషన్ మోర్చా ఎస్ కే యం సంపూర్ణ మద్దతును ప్రకటించింది.
బిజెపి అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వలన ఐదు శాతంగా ఉన్న పెట్టుబడిదారుల వద్ద 70% ఆదాయం పోగుపడగా, 50 శాతం ప్రజల వద్ద కేవలం 3 శాతం మాత్రమే ఉండి రోజు గడవడంమే కష్టంగా మారింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు నేడు ముప్పు వాటిల్లింది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్ లను అమల్లోకి తెస్తున్నారు. 12 గంటల పనిని చట్టబద్దం చేస్తున్నారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్ లను అమలులోకి తెస్తున్నారు. కావున అఖిలపక్ష పార్టీలు, సంఘటిత అసంఘటిత కార్మికులు ప్రభుత్వ రంగ సంస్థ కార్మికులు ఉద్యోగులందరూ ఏకమై ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి సిపిఐ అశ్వారావుపేట నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్,నరసింహారావు,సిపిఐ నాయకులు సయ్యద్ సలీం,గన్నిన రామకృష్ణ,కాంగ్రెస్ నాయకులు తుమ్మ రాంబాబు,సిపిఐ ఎంఎల్ నాయకులు గోకినపల్లి ప్రభాకర్,ఎఐటియుసి నాయకులు పటాన్ జలాల్ ,సిపిఐ పట్టణ నాయకులు నూకవరపు విజయకాంత్, జోగి రాజు,జక్కం బలరాం, షేక్ సైదా, శ్రీను,కార్మిక సంఘాల నాయకులు రహమత్,మూర్తుజా వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES