నవతెలంగాణ – ఆలేరు టౌన్
లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని బిజెపిని డిమాండ్ చేస్తూ, ఫిబ్రవరి 12 న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ జనార్ధన్ అన్నారు. ఆలేరు పట్టణంలో గురువారం జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్ అధ్యక్షతన, ఆర్య వైశ్య భవన్ లో ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12 దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె సన్నాహక సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సులో గీత కార్మిక సంఘం ఐ ఎఫ్ టి యు జిల్లా సీనియర్ నాయకుడు డొంకెన శ్రీహరి,ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు యెలగందుల సిద్దులు,కల్లెపు చంద్రయ్య,పంజాల మురళి, బీబీనగరం నర్సింహులు, సుంచు రాములు, సుంచు అంజయ్య, ప్రజా సంఘాల నాయకులు తమ్మడి అంజయ్య, వంగాల నర్సింహారెడ్డి, చిర బోయిన కొమురయ్య,కడకంచి బీరయ్య తదితరులు పాల్గొన్నారు.



