సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరిపాండు
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్: కార్మిక వర్గ చట్టల రక్షణకై 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. సోమవారం రోజున సిఐటియు ఆధ్వర్యంలో భువనగిరి మండలం లో ఉన్న పరిశ్రమల యజమానులకు, జిల్లా వైద్యాధికారి డీఎంహెచ్ కు సమ్మె నోటిస్ అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాల అవలంబిస్తుందని, ఇలాంటి చట్టాలు అమలు చేయకుండా కార్మిక వర్గంతో వెట్టి చాకిరి చేయించుకుంటుందనారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న స్కీం వర్కర్లు ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా ఉన్నదని పారితోషకం పేరుతో ఆశ వర్కర్ల శ్రమదోపిడి చేస్తున్నదని అన్నారు. ఏళ్ల తరబడిగా గ్రామాలలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలనీ పర్మినెంట్ చేయాలని కార్మిక చట్టాల అమలు చేయాలని పని భారం తగ్గించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు పద్మ, మంగమ్మ, రవి, శీను, ఐలయ్య, సురేష్, లక్ష్మయ్య లు పాల్గొన్నారు.
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES