Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

- Advertisement -

సోమ మల్లారెడ్డి సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి
నవతెలంగాణ గోవిందరావుపేట

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పి కొట్టాలని సిఐటియు ములుగు జిల్లా సహాయ కార్యదర్శి సోమ మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పసర గ్రామంలోని సిఐటియు కార్యాలయంలో 12న జరిగే దేశవ్యాప్త సమ్మె గోడపత్రిక ఆవిష్కరణ జరిగింది.
ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి హాజరై మాట్లాడుతూ .. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 129 కార్మిక చట్టాలను తుంగలో తొక్కి నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక చట్టాలు హక్కులను హరించారని  ఆరోపించారు.

దీంతో కనీస వేతన చట్టం,సామాజిక భద్రత,సమ్మె చేసుకునే హక్కు,సంఘం పెట్టే హక్కు లేకుండా పోతుందని అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరు కార్చి వ్యవసాయ కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తుందని, విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరించాలని రైతు వ్యతిరేక చట్టాలు దొడ్డి దారిన తీసుకరావడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. ఇది కార్మిక వర్గానికి  భారత దేశ ప్రజలకి తీరని నష్టమని పేర్కొన్నారు.ఈ నెల 12న దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ముమ్మడి ఉపేంద్ర చారి, జిట్టబోయిన రమేష్, గరుగు ఐలయ్య,అంబాల మురళి,పల్లపు రాజు, కడారి నాగరాజు. ఊకే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -