Tuesday, February 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి: సీఐటీయూ

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి: సీఐటీయూ

- Advertisement -

సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

2026 ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి అని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ తెలిపారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా సీఐటీయూ కార్యాలయంలో సీఐటీయూ ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కరన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కేంద్ర బిజెపి ప్రభుత్యం తెచ్చిన 4 లేబర్ కోడ్లను ఎన్ ఈ పి 2020 చట్టాన్ని రద్దుచేయాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, ఐసిడిఎస్ ను రక్షించాలని, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఇతర సమస్యలు వెంటనే పరిష్కరించాలని,ఆశా వర్కర్లకు రూ.18,000/-ల ఫిక్సిడ్ వేతనం, ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు.

గ్రామపంచాయతీ ఉద్యోగులను క్రమబద్దించాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కారోబార్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని అన్నారు. విద్యుత్ సవరణ, విబిజీ – రామ్జీ చట్టం, విత్తన సవరణ బిల్లు,  ఎల్ఐసి లో విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక ప్రమాదకర విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, అఖిల భారత ఫెడరేషన్ల పిలుపు మేరకు 2026 ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు జిల్లావ్యాప్తంగా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జనగాం గంగాధర్, మోహన్, లిఫ్ట్ ఇరిగేషన్ జిల్లా అధ్యక్షులు గణేష్, రమేష్, జిల్లా నాయకులు అనసూయ, పద్మ, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -