Monday, July 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ దేశవ్యాపిత సమ్మె, గ్రామీణ నిరసనలను జయప్రదం చేయండి

 దేశవ్యాపిత సమ్మె, గ్రామీణ నిరసనలను జయప్రదం చేయండి

- Advertisement -

-వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్   

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మికుల, పేదల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 9న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె, గ్రామీణ నిరసనలను అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు.

సోమవారం సుందరయ్య భవన్, భువనగిరిలో ప్రజా సంఘాల సంయుక్త సమావేశం రైతు సంఘం జిల్లా నాయకులు ఏదునూరి మల్లేశం అధ్యక్షతన నిర్వహించగా, ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడులను రద్దుచేసి, కనీస వేతనం నెలకు 26 వేలుగా నిర్ణయించాలని, ఎంఎస్.పి హామీలను అమలు చేసి రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, ఉచిత వ్యవసాయ రుణాలు ఇచ్చి వ్యవసాయ పరికరాలకు రాయితీలు కల్పించి ఇవ్వాలని కోరారు. ఉపాధి హామీని బలోపేతం చేసి రూ.2.5 లక్షల కోట్ల నిధులు కేటాయించాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి రోజు కూలీ రూ.600 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జన భద్రత కోసం ఆహార భద్రత కల్పించాలని, ప్రతి ఒక్కరికి 10 కిలోల బియ్యం తోపాటు 14 రకాల నాణ్యమైన నిత్యావసర సరుకులు అందించాలని ప్రభుత్వానికి సూచించారు. ఇండ్లు లేని పేదలందరికీ ఇంటి స్థలాలిచ్చి ఇంటి నిర్మాణం చేసి ఇవ్వాలని, భూమిలేని పేదలకు రెండు ఎకరాల ప్రభుత్వం ఇచ్చి సేద్యం చేసుకుంటున్నా  రైతులకు పట్టాదారు పాు పుస్తకాలు ఇవ్వాలని అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ ప్రైవేటీకరణ విరమించుకోవాలని, దళిత, గిరిజన, ఆదివాసి, మహిళల హక్కులను కాపాడి రక్షణ కల్పించాలని, మనువాదాన్ని తిరస్కరించి భారత రాజ్యాంగాన్ని కాపాడాలని, వ్యవసాయ కార్మికుల కోసం సమగ్ర చట్టం తీసుకురావాలి అన్నారు.

భూ లేని రైతులకు గుర్తించి వారికి సామాజిక భద్రత, బ్యాంకు రుణాలు ఇవ్వాలని, ప్రతి పౌరుడికి నెలనెలా నిరుద్యోగ భృతి రూ.10 వేలు ఇవ్వాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపాలని, పెరుగుతున్న ధరలను అరికట్టాలనే డిమాండ్స్ తో ఈనెల 9న నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మె, గ్రామీణ నిరసనలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో నిరసనలు చేపట్టి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రదర్శన, ర్యాలీలో, ఆందోళనలో  రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పేదలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని  కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, జిల్లా కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య, కొండపురం యాదగిరి, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా నాయకులు కొండ అశోక్, ఐద్వా మండల కార్యదర్శి కొండమడుగు నాగమణి, రైతు సంఘం మండల కార్యదర్శి జిట్టా అంజిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మచ్చ భాస్కర్, రజక వృత్తి దారులు సంఘం మండల నాయకులు ఐతరాజు కిష్టయ్య లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -