Sunday, May 4, 2025
Homeతెలంగాణ రౌండప్20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

20న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

- Advertisement -

సిఐటియు జిల్లా కార్యదర్శి, ఆర్.శ్రీనివాస్
నవతెలంగాణ – ఉప్పునుంతల 
: ఉప్పునుంతల మండల కేంద్రంలో శనివారం సిఐటియు మండల స్థాయి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సన్నాక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ గారు హాజరై మాట్లాడుతూ.. మే 20 న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలి అని ఆయన అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ముఖ్యంగా నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, కార్మిక వర్గం మే 20న జరిగే సమ్మెకు సమయత్వం కావాలని సంఘటిత, అసంఘటితరంగా కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు, ఉద్యోగులు అందరూ ఈ సమయాన్ని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అచ్చంపేట డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ నాయక్, సిఐటియు మండల కార్యదర్శి చింతల నాగరాజు, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ సీఐ టి యు అనుబంధం జిల్లా ఉపాధ్యక్షులు కల మండలం సుల్తాన్, మండల నాయకులు భీమయ్య, రామచంద్రయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -