Sunday, May 4, 2025
Homeతెలంగాణ రౌండప్20న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి ..

20న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి ..

- Advertisement -

సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరిపాండు …
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: కార్మిక వ్యతిరేకి దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియూ జిల్లా అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. శనివారం రోజున భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో ఏవో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. సిఐటియు ఆధ్వర్యంలో మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ భువనగిరి పట్టణంలో అంగన్వాడి హమాలి ఇండస్ట్రీ ఏరియాలో పరిశ్రమలకు పరిశ్రమలా యజమానులకు వివిధ రంగాల యాజమాన్యాలకు సమ్మె నోటీసులు అందించినట్లు తెలిపారు.  కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  కార్మిక వర్గ వ్యతిరేకని కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను యజమానాలకు కట్టబెడుతూ కార్మికుల శ్రమను దోచుకోవడానికి అవకాశం ఇస్తున్నారని 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా చేసి కార్మికులను యాజమాన్యానికి దాసులుగా చేస్తున్నదని  కార్మిక వర్గంపై అనేక రూపాల దాడి చేస్తున్నదని  లక్షలాదిమంది కార్మిక వర్గం స్కీం వర్కర్లుగా అసంఘటిత రంగంలో ప్రభుత్వ రంగాల్లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా కార్మికులుగా పనిచేస్తున్నారని నేటికీ ఎలాంటి చట్టాలు అమలు చేయకుండా వెట్టి  చాకిరి చేయించుకుంటున్నదని స్కీం వర్కర్లను పర్మిట్ చేయాలని కార్మికులకు అందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని కార్మిక చట్టాలు అన్ని రంగాల్లో అమలు చేయాలని తదితర డిమాండ్ల పైన జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని నరేంద్ర మోడీ  అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని వారు అన్నారు . ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయ కృష్ణ,  అంగన్వాడీ  అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిల్వర్ రమాకుమారి, సత్తయ్య వెంకటేశం, రామకృష్ణారెడ్డి, దినేష్, ఎల్లేష్, లక్ష్మయ్య లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -