సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షులు తిప్పిరిశెట్టి శ్రీనివాస్
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తొలిసారిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించే సంచార జాతుల విముక్త దినోత్సవానికి సంచార కులాల ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సంచార జాతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు తిప్పిరిశెట్టి శ్రీనివాస్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో సంచార జాతుల ప్రతినిధులతో ఆదివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సంచార విముక్త జాతుల దినోత్సవ వేడుకల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 52 సంచార కులాలు ఎటువంటి సామాజిక, విద్య, ఉపాధి మరియు రాజకీయ అవకాశాలకు దూరంగా జీవిస్తున్నాయని అన్నారు.
దశాబ్దాలుగా సంచార జాతి ప్రతినిధులు చేస్తున్న పోరాటాలకు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సంచార విముక్త జాతుల దినోత్సవాన్ని ఈనెల 10వ తేదీన హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నారని ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారని కాబట్టి ఈ కార్యక్రమానికి సంచార కులాల ప్రజలు అత్యధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లపు సమ్మయ్య, వడ్డెర కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ద్యారంగుల నగేష్, ఓడ్ కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాదవ్ శరత్, వడ్డెర కుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపాని నర్సింహులు, జిల్లా నాయకులు ముద్దంగుల గిరి, ర్యాపాల శ్రీనివాస్, దండుగుల గంగారం, ర్యాపాల వేణు కుమార్, బత్తుల శ్రీనివాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని విజయవంతం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES