నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ (ఏఐజాక్టో) ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 5న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించే పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. లింగారెడ్డిలు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. విద్య హక్కు చట్టం అమలు కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపుతో పాటు పలు డిమాండ్ల సాధనకు ఈ మార్చ్ జరుగుతుందని వారు తెలిపారు. తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు.
విద్యారంగం, వేతన జీవుల ఆశలు నెరవేర్చని బడ్జెట్ : టీఆర్టీఎఫ్
కేంద్ర బడ్జెట్ 2026-27తో విద్యా రంగం, వేతన జీవుల ఆశలు నెరవేరలేదని తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) విమర్శించింది. ఈ మేరకు ఆదివారం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజి రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. సాంకేతిక పరిజ్ఞానానికి, విదేశీ పెట్టుబడులకు బడ్జెట్‌లో పెద్దపీట వేయడం శుభపరిణామమే అయినప్ప టికీ, దేశ భవిష్యత్తుకు పునాదులైన ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికీ, నిరంతరం పన్నులు చెల్లించే ఉద్యోగుల సంక్షేమానికి తగిన ప్రాధాన్యత లభించ కపోవడం కొంత నిరాశ కలిగించిందని వారు పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి అన్యాయం : ఏఐఎస్‌ఎఫ్
కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి అన్యాయం జరిగిందని ఏఐఎస్‌ఎఫ్ విమర్శించింది. ఈ మేరకు ఆదివారం ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మోడీ పాలనలో గత 12 ఏండ్ల నుంచి కేటాయింపులు తగిన మొత్తంలో చేయడం లేదని వారు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో కనీసం 10 శాతం, జీడీపీలో 6 శాతం నిధులు కేటాయించాలని అనేక సంవత్సరాలుగా విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నా కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని వారు విమర్శించారు.
ప్రజా వ్యతిరేక బడ్జెట్ : ఏఐవైఎఫ్
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (ఏఐవైఎఫ్) విమర్శించింది. ఈ మేరకు ఆదివారం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా.సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మేంద్ర ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ బడ్జెట్‌కు వ్యతిరేకంగా దేశ యువత గళమెత్తాలనీ, ఉపాధి, విద్య, గౌరవం కోసం ఐక్యంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. దేశంలోని కోట్లాది నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న కఠిన వాస్తవాల నుంచి పూర్తిగా దూరంగా ఉందని వారు పేర్కొన్నారు.
పార్లమెంట్ మార్చ్‌ను జయప్రదం చేయండి :డీటీఎఫ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



