నవతెలంగాణ – కంఠేశ్వర్
కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను రెండు భాగాలుగా విభజించేందుకు ఆర్థిక బిల్లులో భాగంగా తీసుకొచ్చిన వాలిడేషన్ యాక్ట్ 2025 నువెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఆల్ పెన్ష నర్స్ & రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు అన్నారు. పెన్షనర్లకు డి.ఏలు ఇతర ఆర్థిక ప్రయోజనాలను రద్దు చేసే ప్రతిపాదనలను వెంటనే విరమించుకోవాలని అన్నారు. డిమాండ్ చేస్తూ ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న మహా ధర్నాకు సంఘీభావంగా ఈ నెల 10వ తేదీన(శుక్రవారం) నిజామాబాద్ పాత కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్బంగా ఆదివారం ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో వారు తెలిపారు. పోస్టల్, బిఎస్ఎన్ఎల్, ఆర్ఎంఎస్, రైల్వే, ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అధిక సంఖ్యలో ఉదయం 10:30 కు ప్రారంభమయ్యే ఈ ధర్నాలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. పత్రికా విలేకరుల సమావేశంలో సంఘం జిల్లా నాయకులు శిర్ప హనుమాన్లు, పురుషోత్తం, రాధా కిషన్ తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ 10న పెన్షనర్ల ధర్నాను విజయవంతం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES