నవతెలంగాణ – జన్నారం
ఈనెల 28న హైదరాబాదులో నిర్వహించే కుమ్మరుల మేధో మదన సదస్సును (శిబిరం ) విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర మాజీ గౌరవ అధ్యక్షులు కోడూరు చంద్రయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. చాలా ఏండ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని కుమ్మరులలో కదలిక ఏర్పరచడానికి చైతన్య పరచడానికి ఒక మంచి కార్యక్రమాన్ని అఖిల భారతీయ కుమ్మర ప్రజాపతి కుంభాకార్ మహా సంఘ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు చేస్తున్నారని ఈ సందర్భంగా సంఘ కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమం విస్తృతంగా ప్రచారం జరగవలసి ఉందని, ప్రతి జిల్లాలో కుమ్మర కులస్తులు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఉప సర్పంచ్ లుగా అనేకమంది గెలిచినారనీ, వాళ్లకు ఈ సమాచారము అందడానికి రాష్ట్రస్థాయిలో 33 జిల్లాల్లో ఈ కార్యక్రమం సమాచారం అందక ఒక మంచి అవకాశాన్ని కోల్పోతున్నారని. ఇప్పటికైనా ప్రతి జిల్లాలో గెలిచిన వారి వివరాలు సేకరించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సేకరించే ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నామని చంద్రయ్య అన్నారు. ఈ మేధో మదన శిబిరంలో పది అంశాలపై చర్చ జరపడం అభినందనీయం అన్నారు.
ఆ అంశాలలో ముఖ్యమైన వాటిలో కుమ్మర కులవృత్తి పైన మరియు వీఈఏసీసి ఐ (వంశ పారంపరక్ ఇంటర్ప్రెనేర్స్ అండ్ ఆర్టిజన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా ) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి పొందవలసిన సహకారము, గ్రామ దేవతల ఆలయాలలో కుమ్మర పూజారుల నియామకం అలాగే రానున్న బీ సీ ఉద్యమంలో కుమ్మరుల పాత్ర ఆ తదుపరి రాజకీయ క్షేత్రంలో కుమ్మరుల పాత్ర అనే అంశాలపై చర్చ జరగనున్నది. ఈ మేధో మదన శిబిరము హైదరాబాదులోని బోడుప్పల్ “రాఘవ బంకెట్ హాల్లో ” ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరగనుంది అన్నారు. ఈ సదస్సుకు కుమారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.



