Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రజాఫ్రంట్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

ప్రజాఫ్రంట్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయండి

- Advertisement -

జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్..
నవతెలంగాణ – మల్హర్ రావు
: తెలంగాణ ప్రజా ఫ్రంట్ 4వ రాష్ట్ర మహాసభల విజయవంతం చేయాలని మంగళవారం కాటారంలో కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ మాట్లాడారు. ఈనెల జూన్ 29,30, 2025  తేదీలలో వరంగల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాల్గవ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ 2010 అక్టోబర్ 9న  ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షతో ఏర్పడి గడిచిన 15 సవత్సరాలుగా  ఆదివాసీలు, దళితులు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, మైనారిటీలు, విధ్యార్థులు, రైతులు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రధాన  ఎజెండగా ఏర్పరుచుకొని వాటి మౌలిక పరిస్కారం కోసం పంచేస్తున్నదన్నారు.

ఈ గడిచిన కాలం అంతటా  ఎక్కడ రాజి పడకుండా టిపిఏప్ వ్యస్థాపకులు,అమరులు ప్రజా యుద్ధ నౌక గద్దర్, ఆకుల భూమయ్య, పులి మామిడి మద్దిలేటి  లాంటి ఆదర్శ నాయకులు  నెలకొల్పిన విలువల పైన వారి ఆశయాలను కొంసాగించటం కోసం  నిర్వీరామ కృషి చేస్తున్నదన్నారు. పాలక పార్టీలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి  ప్రజల మౌలిక సమస్యలు  పరిస్కారం  చేస్తామని అధికారంలోకి వస్తున్నారని, ఒక్కసారి అధికారం చేతుల్లోకి వచ్చినాక  వారి దోపిడీ స్వభావం బహిర్గతమౌతున్నది. ఈ రెండు నాల్కల ధోరణి  పేద వర్గాల ప్రజలు ఆర్థం చేసుకొని  సమస్యల పరిస్కారం కోసం  పాలకులను ప్రశ్నిస్తే   ప్రజలను సంఘ విద్రోహ శక్తులుగా, చిత్రీకరించి, ఈ పోరాటలకు మద్దతుగా వున్నా సంఘాలను  చట్టవ్యతిరేక సంస్థలుగా ప్రకటించి  నిర్భందాన్ని కొనసాగిస్తున్నారు.

రాజ్యాంగం పరిధిలో పరిస్కారం కావాల్సిన ప్రజల మౌలిక సమస్యలు  ఎందుకు  ఇంత  కాలంగా   పరిశ్కారానికి నోచుకోలేదో  పాలకులు ఆలోచించుకోవాలి. సమాజంలో  దోపిడీ, అణిచివేత  వున్నంతవరకు ప్రజా ఉద్యమాలు, ఉద్యమకారులు  ఉంటారని  పాలకులు గుర్తించుకోవాలి. టిపీప్ లాంటి సంస్థలు నిరంతరం  ప్రజల వైపు నిలబడి  నిత్యం ప్రజలతో  వుంటాయని, ఇలాంటి సంఘాలను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, కార్మికులు, విద్యార్థులు  అందరిచాలని పిలిపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ జిల్లా ఉపాధ్యక్షురాలు కుడుమేత సరస్వతి. జిల్లా ప్రధాన కార్యదర్శి దుబాసి పార్వతి. జిల్లా నాయకులు దారకొండ సూర్యశంకర్. అయిత బాపు యువజన నాయకుడు అక్కల బాపు యాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad